fbpx

Saina Nehwal and PV Sindhu entered into Malaysian Masters Women’s Singles – సైనా నెహ్వాల్‌, పి.వి సింధు మలేషియా మాస్టర్స్‌ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్స్‌లో ప్రవేశించారు

Saina Nehwal and PV Sindhu entered into Malaysian Masters Women’s Singles: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్‌, పి.వి సింధు కొత్త ఏడాదిలో దూసుకుపోతున్నారు. మలేషియా మాస్టర్స్‌ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్స్‌లో ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో థారులాండ్‌ అమ్మాయి అన్సె యంగ్‌పై 25-23, 21-12తో సైనా నెహ్వాల్‌ విజయం సాధించింది. 34 నిమిషాల్లో ముగిసిన మరో ప్రీ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో పి.వి సింధు 21-19, 21-15తో వరల్డ్‌ నం.19 షట్లర్‌ అయ ఒహరి (జపాన్‌)పై అలవోక విజయం నమోదు చేసింది.
యంగ్‌తో మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌లో గట్టి పోటీ ఎదుర్కొంది. సూపర్‌ టైబ్రేకర్‌కు వెళ్లిన తొలి గేమ్‌ను సైనా 25-23తో గెల్చుకుంది.

కానీ రెండో గేమ్‌లో సైనా సత్తా చాటింది. ఇద్దరు షట్లర్ల మధ్య వ్యత్యాసం చూపించింది. పెద్దగా చెమటోడ్చకుండానే సైనా నెహ్వాల్‌ క్వార్టర్స్‌లో కాలుమోపింది. జపాన్‌ అమ్మాయిపై కష్టపడకుండానే సింధు గెలుపొందింది.

Saina Nehwal and PV Sindhu entered into Malaysian Masters Women’s Singles

Saina Nehwal and PV Sindhu
Saina Nehwal and PV Sindhu

తొలి గేమ్‌లో పోటీనిచ్చిన అయ రెండో గేమ్‌లోనూ వెంటాడింది. కానీ సింధు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. పురుషుల సింగిల్స్‌లో సమీర్‌ వర్మ 19-21, 20-22తో పోరాడి ఓడాడు. మలేషియా ఆటగాడు లీ జీ జియ వరుస గేముల్లో సమీర్‌ వర్మపై గెలుపొందాడు. మరోమ్యాచ్‌లో హెచ్‌.ఎస్‌ ప్రణరు సైతం 14-21, 16-21తో వరల్డ్‌ నం.1 కెంటా మోమోట (జపాన్‌) చేతిలో మట్టికరిచాడు.

Be the first to comment on "Saina Nehwal and PV Sindhu entered into Malaysian Masters Women’s Singles – సైనా నెహ్వాల్‌, పి.వి సింధు మలేషియా మాస్టర్స్‌ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్స్‌లో ప్రవేశించారు"

Leave a comment

Your email address will not be published.


*