fbpx

Bumrah as the best cricketer in BCCI Awards 2018-19 – ఉత్తమ క్రికెటర్ గా బుమ్రా

The Board of Control for Cricket in India (BCCI) has announced the awards for the 2018-2019 season. The awards ceremony was held in Mumbai yesterday. The ceremony was attended by BCCI President Sourav Ganguly, Team India captain Virat Kohli and many former Indian cricketers.

2018-2019 సీజన్ కు గాను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల ప్రధానోత్సవం నిన్న ముంబై లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు విజేతల తో పాటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ , టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే పలువురు భారత మాజీ క్రికెటర్లు హాజరైయ్యారు.

ఇక టీమిండియా యువఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ,ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డు కు ఎంపిక కావడం తో అతన్ని బీసీసీఐ , పాలీ ఉమ్రిగర్ పురస్కారంతో సన్మానించింది. మహిళా క్రికెటర్ల లో పూనమ్ యాదవ్, ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ గా ఎంపికయ్యింది. వీరితోపాటు ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్ర ఆటగాడిగా మయాంక్ అగర్వాల్ ఎంపిక కాగా మహిళా క్రికెట్ లో షఫాలీ వెర్మ ఈ అవార్డు దక్కించుకుంది. శివమ్ దూబే ను ఉత్తమ రంజీ ఆల్ రౌండర్ అవార్డు వరించగా భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ను కోల్ సీకే నాయుడు జీవిత కాల పురస్కారంతో సత్కరించారు. ఆయనతో పాటు భారత మాజీ మహిళా క్రికెటర్ అంజుమ్ చోప్రా ను కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డు తో సన్మానించింది బీసీసీఐ.

Bumrah as the best cricketer
Bumrah as the best cricketer

భారత స్టార్‌ పేసర్‌, యార్కర్ల హీరో జశ్‌ప్రీత్‌ బుమ్రా ప్రతిష్టాత్మక పురస్కారం దక్కించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన రెండేండ్లలోనే బుమ్రా తనదైన ముద్ర చూపించాడు. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లలో ఐదు వికెట్ల ప్రదర్శనలు చేసిన ఏకైక ఆసియా బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 12 టెస్టుల్లో 62 వికెట్లు కూల్చిన బుమ్రా భారత టెస్టు విజయాల్లో బహుముఖ పాత్ర పోషించాడు. టెస్టు, వన్డే, టీ20ల్లో భారత టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచిన జశ్‌ప్రీత్‌ బుమ్రా బీసీసీఐ ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రిగర్‌ అవార్డు సొంతం చేసుకున్నాడు.ఈ ఏడాది అత్యుత్తమ భారత క్రికెటర్‌గా బుమ్రా ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. మహిళా క్రికెటర్‌ పూనమ్‌ యాదవ్‌ ఈ ఏడాది అత్యుత్తమ భారత క్రికెటర్‌ (మహిళలు) అవార్డు దక్కించుకుంది. కష్టమాచారి శ్రీకాంత్‌ సికె నాయుడు జీవన కాల సాఫల్య పురస్కారం, అంజుమ్‌ చొప్రా బీసీసీఐ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కించుకున్నారు. దిలిపి దోషి బీసీసీఐ ప్రత్యేక పురస్కారం అందుకుంది.

టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన చటేశ్వర్‌ పుజార, అత్యధిక వికెట్లు కూల్చిన జశ్‌ప్రీత్‌ బుమ్రాలు దిలిప్‌ సర్దేశారు అవార్డులు సాధించారు. మహిళల క్రికెట్‌లో స్మృతీ మంధాన, జులన్‌ గోస్వామిలు ఈ అవార్డులు దక్కించుకున్నారు. ఉత్తమ అరంగ్రేట క్రికెటర్లు అవార్డులను మయాంక్‌ అగర్వాల్‌, సఫాలీ వర్మలు చేజిక్కించుకున్నారు. దేశవాళీ క్రికెట్‌లో రాణించిన శివం దూబె, నితీశ్‌ రానా లాలా అమర్‌నాథ్‌ పురస్కారాలు సాధించారు.

దేశవాళీలో ఉత్తమ ప్రదర్శన చేసిన జట్టుగా విదర్భ నిలిచింది. బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రదాన వేడుక ఆదివారం ముంబయిలో జరిగింది. భారత మాజీ విధ్వంసక ఓపెనర్‌ వీరెందర్‌ సెహ్వాగ్‌ 7వ పటౌడీ స్మారక ఉపన్యాసం చేశారు!. కార్యక్రమానికి భారత మెన్స్‌, ఉమెన్స్‌ జట్ల క్రికెటర్లు, బీసీసీఐ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Be the first to comment on "Bumrah as the best cricketer in BCCI Awards 2018-19 – ఉత్తమ క్రికెటర్ గా బుమ్రా"

Leave a comment

Your email address will not be published.


*