fbpx

Mahabubabad international gang of smuggling marijuana has been arrested – గంజాయి స్మగ్లింగ్‌ ముఠా అరెస్ట్‌

international gang of smuggling marijuana has been arrested: గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠాను అరెస్ట్‌ చేసినట్లు మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పెట్రోలింగ్‌లో భాగంగా జమాండ్లపల్లి నుంచి కంబాలపల్లి వెళ్తుండగా ముత్యాలమ్మగూడెం క్రాస్‌ రోడ్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా మూడు తెల్లని ప్లాసిక్‌ బస్తా సంచులతో కన్పించారు. పోలీసులను చూసి వారు పారిపోతుండగా వెంబడించి పట్టుకుని సంచులను తనిఖీ చేయగా అందులో గంజాయి ఉన్నట్లు గమనించామన్నారు.

smuggling marijuana has been arrested
smuggling marijuana has been arrested

అనంతరం వారిని విచారించగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా ఏటపాక మండలం కుస్మాన్‌పల్లి శివారు తోటపల్లికి చెందిన తోడమ్‌ శ్రీనివాస్‌, మహబూబాబాద్‌ మండలం బోడగుట్టతండాకు చెందిన బానోత్‌ కుమార్‌గా తెలిసిందన్నారు. రెండేళ్ల క్రితం శ్రీనివాస్‌ భద్రాచలంలో బానోత్‌ కుమార్‌కు పరిచయం కాగా వీరిద్దరు ఒడిశాకు వెళ్లి అక్కడ నుంచి కేజీ గంజాయి రూ.

3 వేలకు కొనుగోలు చేసి హైదరాబాద్‌ చుట్టుపక్కల కేజీ రూ. 10 వేల చొప్పున విక్రయిస్తున్నారని తెలిసింది. ఒడిశా నుంచి గంజాయితో భద్రాచలం వరకు బస్సులో వచ్చి అక్కడ నుంచి ఆటోలో మహబూబాబాద్‌ వచ్చి బోడగుట్టతండాలోని కుమార్‌ ఇంట్లో భద్రపరిచారు. హైదరాబాద్‌ వెళ్లి విక్రయిస్తామనుకునే క్రమంలో వారిని మహబూబాబాద్‌ రూరల్‌ పోలీసులు వారిని పట్టుకున్నారని తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపనున్నట్లు ఎస్పీ తెలిపారు. గంజాయిని పట్టుకున్న రూరల్‌ సీఐ, ఎస్సై, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Be the first to comment on "Mahabubabad international gang of smuggling marijuana has been arrested – గంజాయి స్మగ్లింగ్‌ ముఠా అరెస్ట్‌"

Leave a comment

Your email address will not be published.


*