fbpx

Report to Polices While you go to Home for Sankranthi – సంక్రాంతికి ఊరెళ్తున్నారా…

Hyderabad Polices warned as follows : అసలే పండుగ.. ఆపై వారాంతాలు.. సంక్రాంతికి నాలుగు రోజుల ముందే నగర వాసులు ఊరెళ్లిపోతున్నారు. పెట్టే బేడ సద్దేసి ఇంటికి తాళం వేస్తున్నారు. ఇదే సమయంలో దొంగలు చోర ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తారనే విషయాన్ని మరుస్తున్నారు.

Telangana Police Logo
Telangana Police Logo

దీంతో ఊరెళ్లి వచ్చేసరికి దొంగలు ఇళ్లలో పడి దోచేస్తున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో ఊరెళ్లే వారు ఆ విషయాన్ని తమ దృష్టికి తేవడంతో పాటు కొన్ని స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని బేగంపేట ఏసీపీ పింగిలి నరేష్ రెడ్డి పే ర్కొన్నారు. పండుగ సందర్భంగా పోలీసులు తీసుకుంటున్న జాగ్రత్తలను వివరించారు. బేగంపేట ఏసీపీ సబ్‌ డివిజన్‌ పరిధిలోని బేగంపేట, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, బొల్లారం పోలీస్‌స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో చోరీలు జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు ఏసీపీ తెలిపారు.

ఇందులో కొన్ని ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడ గస్తీని ముమ్మరం చేస్తున్నట్టు వివరించారు. సిబ్బందికి అదనపు బాధ్యతలను అప్పగించినట్టు తెలిపారు. సెక్టారు వారీగా ఎస్సైలను అప్రమత్తం చేయడంతో క్రైంటీం బలగాలు నిరంతం గస్తీ తిరుగుతాయన్నారు.

తాళం వేసి ఉన్న ఇళ్లలో సాధరణంగా తెల్లవారుజామున చోరీలు జరుగుతుంటాయి. కాబట్టి అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుజాము 7 వరకు ప్రతి గంటకోసారి పెట్రోలింగ్‌ నిర్వహించేలా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. శాంతిభద్రతల విభాగం కూడా ఇందకు సహకరిస్తుందని అన్నారు.

పండుగ వేళలో అధికం

సంక్రాంతి, దసరా వంటి పండుగల కు నగర వా సులు పల్లె బాట పడతారని దొంగలకు తెలుసు. అందుకే వారు ఈ సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్ల వద్ద రెక్కి నిర్వహిస్తూ ఉంటారు. అదును దొరకగానే దోచేస్తారు. అం దుకే నగర వ్యాప్తంగా జనవ రిలో చోరీల కేసులు కాస్త అధికంగానే ఉంటాయి. మా రిన పోలీసింగ్‌ విధానంతో చోరులు వెంటనే దొరుకుతున్నప్పటికీ నేరం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని పోలీసులు అంటున్నారు. ముఖ్యంగా కాలనీల్లో ఇలాంటి చోరీలు అధికంగా జరుగుతుంటాయని తెలిపారు.

ఈ జాగ్రత్తలు పాటించండి

  • పండుగకు ఊరెళ్లే ఇంటి యజమానులు జాగ్రత్తలు పాటించకపోతే దొంగకు తాళం ఇచ్చినట్టే అవుతుంది
  • ఊరెళ్లే వారు ఠాణాలో తమ పూర్తి వివరాలను అందించాలి. అలా ఇచ్చివెళ్లే వారి ఇళ్లపై ప్రత్యేక దృష్టి పెడతాం.
  • ఇంట్లో ఎలాంటి విలువైన ఆభరణాలు విడిచి వెళ్లరాదు. ఒకవేళ ఉంటే బ్యాంకు లాకర్లో పెట్టి వెళ్లడమో లేదంటే తమ వెంట తీసుకెళ్లడమో చేయాలి.
  • ఇంటి యజమానుల చుట్టుపక్కల వారికి చెప్పి వెళ్లడం మంచిది. వారు కూడా కొంత దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది.
  • ద్విచక్ర వాహనాలుంటే ఇంటి లోపల పెట్టుకోవాలి.
  • ఇంటి లోపల విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి వెళ్లాలి. షార్ట్‌సర్య్కూట్‌ ప్రమాదాలను నివారించొచ్చు.
  • వీలైతే ఇంటి లోపలకాని లేదంటే బయటకాని సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ దొంగతనం జరిగినా నిందితులను పట్టుకునే అవకాశాలుంటాయి. ఫ ఎవరైనా దొంగలను గుర్తిస్తే వెంటనే ఠాణాలో సమాచారం ఇవ్వొచ్చు. ఇబ్బం ది ఎదరైతే 100 లేదా ఆయా పోలీ్‌సస్టేషన్లకు సమాచారం ఇవ్వొచ్చు.

Be the first to comment on "Report to Polices While you go to Home for Sankranthi – సంక్రాంతికి ఊరెళ్తున్నారా…"

Leave a comment

Your email address will not be published.


*