fbpx

Pulse Polio in Andhra & Te;angana January 19th – పల్స్‌ పోలియోకు విశేష స్పందన

Pulse Polio in Andhra & Te;angana January 19th: చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు చేపట్టిన పల్స్‌ పోలియో కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 0- 5 సంవత్సరాలోపు ప్లిలలకు పల్స్‌ పోలియే వేసేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కమ్యూటీ సెంటర్లు, పాఠశాలల్లో పల్స్‌పోలియో కోసం ఏర్పాట్లుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 23,331 పోలియో కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు వేసేందుకు అధికారులు ఏర్పాట్లుచేసినట్టు తెలిపారు.

polio drops andhrapradesh telangana
polio drops andhrapradesh telangana

అన్ని కేంద్రాలకూ ప్రజలు పెద్దసంఖ్యలో తరలి వచ్చి పసి పిల్లలకు పోలియో చుక్కలు వేయించారని అధికారులు తెలిపారు. కాగా ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పల్స్‌పోలియే కార్యక్రమంలో పాల్గొని పసిపిల్లలకు పోలియో చుక్కలు వేశారు. కేవలం నిర్ణీత ప్రదేశంలోనే కాకుండా ప్రయాణాల్లోఉన్న వారికి కోసం 723 ట్రాన్సిట్‌ కేంద్రాల ద్వారా అన్నిబస్‌స్టాండ్‌లలోనూ, రైల్వేస్టేషన్‌లలోనూ, ప్రధాన కూడల్లలో పోలియో చుక్కలు వేసేఏర్పాట్లు చేశారు. పల్ప్‌పోలియోలో సంచార జాతులు, భిక్షాటన చేసేవారు, ఇటుబట్టీల్లో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, పట్టణ మురికివాడలు, నగర శివారు ప్రాంతాలు, చేపలు పట్టేవారు, ఆదివాసీలు నివసించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టినట్టుఅధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో మహిళా శిశుసంక్షేమశాఖ, పురపాలకశాఖ, విద్యాశాఖ, రెవెన్యూ, విద్యుత్‌, పంచాయితీరాజ్‌, ఐకేపీ, పోలీస్‌, ఆర్టీసీతదితర శాఖల సమన్వయంతో పల్స్‌ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం పోలియో చుక్కలు వేసుకోలేక పోయిన వారికి మరోరెండు రోజుల పాటు బృందాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటిని సందర్శించి పోలియో చుక్కలు వేసే ఏర్పాట్లుచేసినట్టు అధికారులు తెలిపారు.

Be the first to comment on "Pulse Polio in Andhra & Te;angana January 19th – పల్స్‌ పోలియోకు విశేష స్పందన"

Leave a comment

Your email address will not be published.


*