fbpx

Nirbhaya Case – నిర్భయ కేసులో దోషులను ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది

Nirbhaya Case: నిర్భయ కేసులో దోషులను ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని ఢిల్లి పాటియాలా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దోషులలో ఒకరైన ముఖేష్‌ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేడు తిరస్కరించారు. అంతకుముందు ప్రభుత్వ న్యాయవాది క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయం సంబంధిత దోషికి తెలియజేశారా అని కోర్టు ప్రశ్నించింది. ఒక గంటలో సమాచారం తెలుసుకుని చెబుతానని న్యాయవాది కోర్టుకు సమాధానమిచ్చారు. దీనితో తీర్పును కొద్దిసేపు వాయిదా వేశారు. తీహార్‌ జైలులో ఉన్న దోషికి సమాచారం అధికారికంగా అందజేశారని న్యాయవాది కోర్టుకు తెలిపిన తరువాత ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు వారిని ఉరి తీయాలని కోర్టు తీర్పు చెప్పింది.

Nirbhaya Case
Nirbhaya Case

వాస్తవానికి వారిని ఈ నెల 22వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరి తీయాల్సి ఉండగా ముఖేష్‌ క్షమాభిక్ష పిటిషన్‌ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందనే కారణంగా ఉరిశిక్ష అమలు వాయిదా పడింది.

Be the first to comment on "Nirbhaya Case – నిర్భయ కేసులో దోషులను ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది"

Leave a comment

Your email address will not be published.


*