fbpx

Kolkata Port Trust name Changed – కోల్‌కతా పోర్టు ట్రస్ట్‌ పేరు మార్చారు

దేశంలోని పురాతన ఓడరేవుల్లో ఒకటిగా పేరొందిన కోల్‌కతా పోర్టు ట్రస్ట్‌ పేరు మార్చారు. ఆదివారం కోల్‌కతా పోర్ట్‌ ట్రస్ట్‌ 150వ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఓడరేవు పేరును భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ‘డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ’ పోర్టుగా మారుస్తున్నట్లు ప్రకటించారు.

కోల్‌కతా పోర్ట్‌తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ రోజు చాలా ప్రత్యేకమైనదన్నారు. అంతేకాకుండా స్వాతంత్ర్యం వచ్చింది మొదలు దేశ ప్రగతికి సాక్షంగా నిలిచిన చరిత్రాత్మకమైన పోర్టు ఇక మీదట ‘డా. శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ పోర్టు’గా పిలవటం సంతోషించదగిన విషయమని పేర్కొన్నారు. నౌకాశ్రయం దేశ పారిశ్రామిక, ఆధ్యాత్మిక, స్వయం సమృద్ధికి సూచికగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 150వ వార్షికోత్సవం సందర్భంగా పోర్టును మరింత శక్తివంతమైన చిహ్నంగా మార్చడం మన బాధ్యత అని గుర్తుచేశారు.

మా పథకాలు దోచుకునేవి కావు..

పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) ముందునుంచి వ్యతిరేకిస్తున్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌, కిసాన్‌ సమ్మాన్‌ పథకాలను రాష్ట్రంలో అమలు చేయకపోవటంపై బెంగాల్‌ ప్రభుత్వాన్ని మోదీ విమర్శించారు. ఎంత త్వరగా ఆ పథకాలను అమలు చేస్తే అంత త్వరగా పేద, మధ్య తరగతి ప్రజలకు లాభం చేకూరుతుందన్నారు. గత ఏడాది టీఎంసీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రస్తావిస్తూ.. ‘మా పథకాలు పేదలను దోచుకుతినేవి కావు. వారికి లబ్ధి చేకూర్చేవి. అలానే మా పథకాల్లో ఎటువంటి మధ్యవర్తిత్వం ఉండదు’ అని ఆరోపించారు.

Kolkata Port Trust name Changed
Kolkata Port Trust name Changed


అంతకముందు ఉదయం హావ్‌డాలోని బేళూరు మఠంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన మోదీ.. సీఏఏపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాయని విమర్శించారు.

Be the first to comment on "Kolkata Port Trust name Changed – కోల్‌కతా పోర్టు ట్రస్ట్‌ పేరు మార్చారు"

Leave a comment

Your email address will not be published.


*