fbpx

Medaram Sammakka Sarakka Jatara Update – భక్తులతో కిక్కిరిసిన మేడారం!

Medaram Sammakka Sarakka Jatara: వరంగల్‌ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం పోటెత్తింది. ఆదివారం కావడంతో జాతరకు ముందే సరిహద్దు జిల్లాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ నుండి భక్తులు మేడారంకు చేరుకున్నారు. జంపన్న వాగులో పవిత్ర స్నానాలు ఆచరించారు. వనదేవతలు సమ్మక్క.. సారలమ్మలను దర్శించుకొని గద్దె వద్ద మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో మేడారం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయింది.

medaram sammakka sarakka
medaram sammakka sarakka

జాతర సందర్భంగా కోట్లాది మంది ప్రజలు మేడారంను సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 8 వరకు మేడారం జాతర జరుగనుంది.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి మేడారం చేరుకుని ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. సోమేష్ కుమార్ వివిధ విభాగాల అధికారులతో చర్చలు జరిపి పనులను వేగవంతం చేయాలని కోరారు.

Be the first to comment on "Medaram Sammakka Sarakka Jatara Update – భక్తులతో కిక్కిరిసిన మేడారం!"

Leave a comment

Your email address will not be published.


*